జీ తెలుగులో ప్రసారమయ్యే అదిరింది ప్రోగ్రామ్ లో సీఎం జగన్ పై అనుచిత స్కిట్ చేసిన కారణంగా ఆ ప్రోగ్రామ్ చేసిన వాళ్లని ఓ ఆట ఆడేసుకుంటున్నారు నెటిజన్లు, వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు. ఏకంగా ఏపీలో జీ తెలుగు ప్రసారాలు నిలిపివేయాలంటూ.. బ్యాన్ జీ తెలుగు అంటూ సోషల్ మీడియాలో ఓ ఉద్యమాన్నే మొదలు పెట్టారు. దీంతో ఏపీలో జీ తెలుగు ప్రసారాలు ఆగిపోతాయని పుకార్లు మొదలయ్యాయి.