రాష్ట్రంలో ఆలయ ఘటనలకు సంబంధించి నమోదైన ఐదు కేసుల్లో చర్యలు తీసుకున్నట్టు డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు. ఆలయాలకు సంబంధించిన విషయాలు వాస్తవమో కాదో తెలుసుకోకుండా సోషల్ మీడియాలో షేర్ చేయకూడదని ఆయన సూచించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో అంతర్వేది ఘటన మొదలు 33 కేసుల్లో 27 కేసులను ఛేదించామని, మూడు అంతర్ రాష్ట్ర ముఠాలను అరెస్టు చేశామని అన్నారు. 76 కేసుల్లో 178 మందిని అరెస్టు చేశామని చెప్పారు.