ఢిల్లీలోని జామియా నగర్లో 13 ఏళ్ళ బాలికకు బాల్య వివాహం చేయాలనుకున్న కుటుంబ సభ్యులను ఢిల్లీ ఉమెన్ కమిషన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజులు ఆలస్యం అయినట్లయితే బాలికకు కుటుంబ సభ్యులు వివాహం జరిపించే వారని అధికారులు వెల్లడించారు. బాల్యవివాహాలు చేయాలని ప్రయత్నించే వారి పై కఠిన శిక్షలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు.