మంత్రి గంగుల కమలాకర్ సచివాలయం బీఆర్కే భవన్లో వరిధాన్యం కొనుగోలుపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తొందరపడి ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్మవద్దని సూచించారు. ఇకపోతే రైతులు ధాన్యం మంచిగా ఎండబెట్టాలని, తాలు, పొళ్లు లేకుండా జాగ్రత్తపడి తెచ్చిన ధాన్యానికి మంచి మద్దతు ధర పలుకుతుందని సూచించారు.