గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో బాగా హాట్ టాపిక్ అవుతున్న అంశం ఏదైనా ఉందంటే...అది వైసీపీ ఎన్డీయేలో చేరబోతుందనే ప్రచారం గురించే. కేంద్రంలో ఫుల్ మెజారిటీతో ఉన్న ఎన్డీయేలో వైసీపీ చేరబోతుందంటూ అనేక కథనాలు వస్తున్నాయి. ఇక దీనిపై వైసీపీ నేతలు పెద్దగా స్పందించడం లేదు. అటు బీజేపీ నేతలు కూడా దీనిపై క్లారిటీ ఇవ్వడం లేదు. కానీ ప్రతిపక్ష టీడీపీ మాత్రం ఈ విషయంపై అనేక రకాలుగా విమర్శలు చేస్తుంది.