ఏపీలో ప్రతిపక్ష టీడీపీ నేతలు మంత్రి గుమ్మనూరు జయరాంని వదిలేలా కనిపించడం లేదు. ఆయన పదవి పోయే వరకు నిద్రపోయేలా లేరు. అసలు ఏ మంత్రిని టార్గెట్ చేయని విధంగా టీడీపీ నేతలు జయరాంని ఇబ్బంది పెడుతున్నారు. మొదట జయరాం సొంత గ్రామంలో పేకాట క్లబ్స్ నిర్వహిస్తున్నారని ఆరోపణలు చేశారు. దానికి తగ్గట్టుగానే ఈ పేకాట విషయంలో మంత్రి సోదరుడు ప్రమేయం ఉందని విమర్శలు వచ్చాయి. అయితే మంత్రి పేకాట క్లబ్బులకు తనకు ఏం సంబందం లేదని క్లారిటీ ఇచ్చేశారు.