కృష్ణా జిల్లాలో గన్నవరం రాజకీయాలు బాగా హాట్ హాట్‌గా నడుస్తున్నాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీని వీడిన దగ్గర నుంచి గన్నవరం రాజకీయాల్లో ఏదొక ఇష్యూ జరుగుతూనే ఉంది. రెండోసారి గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ..హఠాత్తుగా టీడీపీకి షాక్ ఇచ్చి, జగన్‌కు జై కొట్టారు. అక్కడ నుంచి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. అలాగే టీడీపీ నేతలు కూడా వంశీకు కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.