తెలంగాణ ప్రభుత్వ సర్వీసుల్లో ప్రమోషన్ల పీరియడ్ ని తగ్గించి ఆ రాష్ట్ర ఉద్యోగులకు కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి మూడేళ్లకు పదోన్నతులు ఉంటాయి. కానీ కేసీఆర్ మాత్రం తెలంగాణలో రెండేళ్లకే ప్రమోషన్లు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారు. పదోన్నతుల కాలపరిమితి తగ్గిస్తే.. ఉద్యోగులు గరిష్టంగా లాభపడతారు.