ఏపీలో కేసుల సంఖ్య తగ్గుతున్న దశలో.. టెస్ట్ ల సంఖ్య కూడా తగ్గించే దిశగా ప్రభుత్వం ఆలోచించాలి. కానీ టెస్ట్ ల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాజిటివ్ వచ్చినవారందరినీ ఎంత త్వరగా గుర్తించి వైద్యం చేస్తే.. అంత త్వరగా కరోనా సామాజిక వ్యాప్తిని అడ్డుకోవచ్చని అంటున్నారు అధికారులు. అందుకే టెస్ట్ ల సంఖ్య పెంచుతున్నామని చెబుతున్నారు.