రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులు, చోరీల విషయంలో దాదాపు అన్ని కేసులు ఓ కొలిక్కి వస్తున్నాయి కానీ.. దుర్గగుడి వెండి రథానికి ఉన్న సింహాల మాయం విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి పురోగతి లేదని తెలుస్తోంది. అసలీ వెండి సింహాలు మాయమైంది టీడీపీ హయాంలోనా, వైసీపీ హయాంలోనా అన్నది పెద్ద మిస్టరీగా మారింది. వెండి సింహాల మాయం విషయం రాజకీయ రంగు పులుముకునే సరికి కేసు విచారణ పోలీసులకి కూడా కత్తిమీద సాముగా మారింది.