కరోనా అంటే కేవలం జ్వరం, దగ్గు, గొంతు నొప్పి అని ప్రధాన కారణాలే చెప్పేవారు. కేవలం ఈ లక్షణాలే కాదు తలనొప్పి, వాసన, రుచి చూడలేక పోవడం వంటి లక్షణాలు కూడా కనపడతాయని అంటున్నారు వైద్యులు. కేవలం శ్వాసకోశ వ్యవస్థ మీదే కాకుండా కొంత మంది బాధితుల్లో నాడీ వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుందని అన్నారు. ఇందులో ఏకంగా 4 రకాల నాడీ సమస్యలను గుర్తించారు.