చంద్రబాబు రాజకీయమే నారా లోకేష్(చినబాబు)కు వచ్చినట్లు కనిపిస్తోంది. పరిస్థితులని బట్టి, సమయాన్ని బట్టి రాజకీయం చేయడం చంద్రబాబుకు బాగా అలవాటు. ఇప్పుడు అదే చినబాబు కూడా చేస్తున్నారు. గతంలో చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ మీద ఏ రేంజ్లో విరుచుకుపడేవారో తెలిసిందే. కానీ 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి ఘోరంగా దెబ్బతిన్న బాబు తర్వాత 2019 ఎన్నికల్లో ఏపీలో కూడా ఓడిపోయి అధికారం కోల్పోయారు. దీంతో కేసీఆర్పై విమర్శలు చేయడమే మానేశారు.