నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు...గెలిచింది వైసీపీలో, మాట్లాడుతుంది ప్రతిపక్ష నేతలాగా. ఎప్పటి నుంచో ఈయన అధికార వైసీపీకి యాంటీ అయిపోయారు. ప్రతిపక్ష టీడీపీ కంటే ఎక్కువగానే జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ప్రతిరోజూ మీడియా సమావేశం పెట్టడం జగన్పై విరుచుకుపడటం చేస్తున్నారు. ఏపీ ఎంపీగా ఉంటూ ఢిల్లీలో కూర్చుని రచ్చబండ అంటూ రోజూ మధ్యాహ్నం మీడియా సమావేశం పెట్టడం, ఇష్టారాజ్యంగా విమర్శలు చేయడం చేస్తున్నారు.