ఏపీ మంత్రి జయరాం....గత కొన్నిరోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో బాగా హాట్ టాపిక్ అవుతున్న నాయకుడు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన జయరాం...జగన్ కేబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే ఈయన్ని టీడీపీ నేతలు గట్టిగా టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడుని ఈఎస్ఐ స్కామ్లో జైలుకు పంపడంతో, టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు.