గత కొన్నిరోజులుగా శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతలు వర్సెస్ టీడీపీ నేతలు అన్నట్లుగా మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. మంత్రి ధర్మాన కృష్ణదాస్ అమరావతి రైతులని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేయడంతో అసలు గొడవ మొదలైంది. అసలు రైతులని ఉద్దేశించి బూతులు మాట్లాడటం ఏంటని టీడీపీ ఫైర్ అయిపోతుంది. ఇక ఈ వివాదంలోకి అదే జిల్లాకు చెందిన మంత్రి అప్పలరాజు వచ్చి, అమరావతి రైతులు పెయిడ్ ఆర్టిస్టులు అంటూ ఇంకాస్త ఆజ్యం పోశారు.