ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్లాక్ 4.0 అమలవుతోంది. ఈ నెల 15 నుంచి అన్లాక్ 5.0 అమలు అవుతుంది. ప్రస్తుతం జనజీవనం సాధారణ స్థితికి చేరుకోవడంతో ఏపీ ప్రభుత్వం కూడా అక్టోబర్ 15 నుంచి అన్లాక్ 5.0ను అమలు చేస్తానంటోంది. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రంలో రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని మార్గదర్శకాల్లో పేర్కొంది. సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, పెద్ద కొనుగోలు కేంద్రాలను తెరవడానికి అనుమతులు ఇచ్చింది.