కరోనా ముప్పు పూర్తి స్థాయిలో తొలగకపోవడంతో రైతుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ వ్యాప్తంగా 6 వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరపాలని ఆయన అధికారులకు ఆదేశాలిచ్చారు. పంట కొనుగోళ్ల తర్వాత వీలైనంత తక్కువ సమయంలో రైతులకు డబ్బు చెల్లించాలని, దీనికోసం కావాల్సిన ఏర్పాట్లను ముందుగానే చేయాలని సూచించారు.