తెలంగాణలో తాజాగా మరోసారి రాజకీయ చర్చలు వేడి వేడిగా సాగుతున్నాయి. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామ లింగా రెడ్డి అనూహ్య మరణంతో దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక అనివార్యమైంది. రానున్న నెల నవంబర్ 3వ తేదీన జరిగే ఈ ఎన్నిక కోసం అధికార పార్టీ టీఆర్ఎస్, ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ గెలుపే ధ్యేయంగా లైన్ లో వున్నాయి. అంతే కాకుండా ఈ 3 పార్టీలు ఈ స్థానాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం గమనార్హం.