వాసుపల్లి గణేశ్...టీడీపీని వీడి జగన్కు జై కొట్టిన నాలుగో ఎమ్మెల్యే. వైసీపీ అధికారంలోకి వచ్చాక వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాంలు టీడీపీని వీడి జగన్ ప్రభుత్వానికి మద్ధతు తెలిపిన విషయం తెలిసిందే. పదవులకు రాజీనామా చేయకుండా జగన్కు సపోర్ట్ చేస్తూ, అనధికారికంగా వైసీపీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. ఇక వీరిబాటలోనే ఇటీవల విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ కూడా నడిచారు. తన కుమారులకు వైసీపీ కండువా కప్పించి, తాను జగన్ ప్రభుత్వానికి మద్ధతు తెలిపారు.