హైదరాబాద్ మహానగర పాలక సంస్థ చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు సీఎం కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం పాలక మండలిలో 50 శాతం మహిళా రిజర్వేషన్లకు చట్టబద్ధత లభించింది. డివిజన్ల రిజర్వేషన్లు మరో అయిదేళ్ల పాటు కొనసాగుతాయి. ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు కూడా పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. దీంతో చాలామంది మహిళా నాయకులకు వెసులుబాటు లభించినట్టయింది.