సచివాలయాల ద్వారా గ్రామాల స్వరూపం మార్చిన జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి గ్రామాలకు డిజిటల్ విప్లవం తీసుకొస్తోంది. ప్రస్తుతం మండల కేంద్రాలకే పరిమితమైన వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని గ్రామ సచివాలయాల స్థాయికి తీసుకెళ్లాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామ సచివాలయంలో డిజిటల్ టీవీలు ఏర్పాటు చేయబోతున్నారు. ముఖ్యమంత్రితో పాటు అధికారులు నేరుగా గ్రామ సచివాలయాల ఉద్యోగులు లేదా లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడానికి ఈ టీవీలను ఉపయోగిస్తారు.