తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో త్వరలో జరిగే దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి విషయాలను మరియు తాను చేయించిన సర్వేలకు సంబంధించిన అంశాలు గురించి సీఎం కేసీఆర్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత మంచి మెజార్టీతో గెలవనున్నట్లుగా చెప్పుకొచ్చారు. తాముచేయించిన తాజా సర్వేల్లో 74 శాతం మంది టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నట్లుగా సమాచారం.