పవన్ కల్యాణ్...ఇంకా పార్ట్‌టైమ్ రాజకీయాలు చేస్తున్నారా? జనసేనని ఏపీలో బలోపేతం చేసే పని పవన్ చేయడం లేదా? అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తోంది. ప్రశ్నించడం కోసమంటూ పవన్ జనసేన పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో ప్రత్యక్షం పోటీ చేయకుండా టీడీపీ-బీజేపీలకు మద్ధతు ఇచ్చారు. ఇక అప్పుడు టీడీపీ-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది.