మంత్రి జయరాం...గత కొన్నిరోజులుగా ఏపీ రాజకీయాల్లో బాగా హైలైట్ అవుతున్న పేరు. ప్రతిపక్ష టీడీపీ నేతలు జయరాంని టార్గెట్ చేసి రాజకీయం చేస్తున్నారు. ఆయనపై వరుసపెట్టి అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ముందులో మంత్రి జయరాం..సొంత వూరులోనే పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారని విమర్శలు గుప్పించారు. తనకు సంబంధం లేదని మంత్రి క్లారిటీ ఇచ్చినా టీడీపీ నేతలు తగ్గలేదు.