అక్టోబర్ 7వ తేదీన మధ్యప్రదేశ్ రాష్ట్రం, భోపాల్, రేవా నగరంలోని అట్రాయిలా గ్రామంలో 14ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మనస్తాపానికి గురైన బాధితురాలు తనపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు పరిస్థితి నిలకడగానే ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.