అమరావతికోసం ఆగిన గుండె అంటూ మాజీ మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్ పై.. మృతుడి కుమార్తె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల పులి చినలాజరు అనే రైతు అనారోగ్యంతో మరణించగా.. దాన్ని అమరావతి ఉద్యమానికి లింకు పెడుతూ నారా లోకేష్ ఓ ట్వీట్ వేశారు. దీనిపై చినలాజరు కుమార్తె ఎస్తేర్ స్పందించారు. నారా లోకేష్ పెట్టిన ట్వీట్ లో వాస్తవం లేదని, తన తండ్రి చినలాజరు అనారోగ్యంతో చనిపోయారు కానీ, ఉద్యమ పోరాటంలో కాదని ఆమె స్పష్టం చేశారు.