ఏపీ, తెలంగాణ ఆర్టీసీ మధ్య చర్చలు ఓ కొలిక్కి రాబోతున్నాయి. తెలంగాణ భూభాగంలో ఇప్పటి వరకూ ఏపీఎస్ఆర్టీసీకి చెందిన బస్సులు 2.65 లక్షల కి.మీ. తిరిగేవి. సర్వీసులు తగ్గడంతో ఇకపై 1.61 లక్షల కి.మీ.కే పరిమితం కానున్నాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాలు త్వరలో అంతర్ రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకోబోతున్నాయి. ఈమేరకు ప్రతిపాదనలు సిద్దమయ్యాయి.