హైదరాబాద్ వాసులు ఈ ఏడాది ఎప్పుడూ లేనంతగా అవస్థలు పడుతున్నారు. లాక్ డౌన్ కాలంలో తీవ్ర ఇబ్బందులు పడ్డ భాగ్యనగర వాసులు.. ఇప్పుడు వర్షాలతో సతమతం అవుతున్నారు. ఈ ఏడాది హైదరాబాద్ లో రికార్డ్ స్థాయి వర్షపాతం నమోదైంది. పదేళ్ల రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. అందుకే వర్షాల్లో నగరవాసి ఇబ్బందులు వర్ణణాతీతంగా మారాయి.