నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి తన రాజీనామా విషయంపై స్పందించిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ఎంపీ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పదవికి రాజీనామా చేసి మాట్లాడాలని వైసీపీ నేతలు సవాళ్ళు విసురుతున్నారు. వారికి కౌంటర్‌గా రాజుగారు, పదవికి రాజీనామా చేస్తానని, కానీ అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచితేనే రాజీనామా చేస్తానని, ఒకవేళ ఎన్నికల్లో తాను ఓడిపోతే మూడు రాజధానులు పెట్టుకోవచ్చని, లేదంటే అమరావతినే రాజధానిగా ఉంచాలని సవాల్ విసిరారు.