టీడీపీ మాజీ ఎమ్మెల్యే, గురజాల పులిగా ప్రచారం చేయించుకునే యరపతినేని శ్రీనివాసరావు.. తాజాగా రాజకీయ జోస్యం చెప్పారు. పులివెందుల, కడప ఫ్యాక్షనిజాన్ని పల్నాడు ప్రాంతంలో అమలు చేయాలని చూస్తున్నారని వారి ఆటలు ఇక్కడ సాగబోవని అన్న యరపతినేని.. రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని, ఇది ఎంతో కాలం సాగదని హెచ్చరించారు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. ఇక్కడ నుంచి ఆయన పొలిటికల్ ఫ్యూచర్ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి రానున్న ఆరు నెలల్లో ఎక్కడ ఉంటాడో, ఏ జైలుకు వెళ్తాడో ఆయనకే తెలియదని యరపతినేని వ్యాఖ్యానించారు.