కరోనా సమయం కావడంతో చంద్రబాబు, నారా లోకేష్ ఏపీని గాలికొదిలేసి హైదరాబాద్లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. అయితే అప్పుడప్పుడు చుట్టపుచూపుగా వచ్చి ఏపీ ప్రజలని పలకరిస్తున్నారు. తాజాగా చినబాబు ఏపీకి ఎంట్రీ ఇచ్చారు. అమరావతి ఉద్యమం 300 రోజులు పూర్తి అయిన సందర్భంగా లోకేష్, అమరావతికి వచ్చి రైతుల దీక్షలకు సంఘీభావం తెలిపారు.