ఏపీలో టీడీపీకి అనుకూలంగా ఉండే జిల్లాలో విశాఖపట్నం కూడా ఒకటి. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ టీడీపీ ఘోరంగా ఓడిపోయిన సందర్భాలు పెద్దగా ఏమి లేవు. కానీ 2019 ఎన్నికల్లో జగన్ దెబ్బకు టీడీపీ ఘోరంగా ఓడింది. కాకపోతే విశాఖ నగరంలోని నాలుగు సీట్లని టీడీపీనే కైవసం చేసుకుంది. దీని బట్టి చూస్తే నగరంలో టీడీపీ బలంగా ఉందని అర్ధమైపోయింది.