తెలుగు రాష్ట్రాల్లో వంట నూనెల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో నూనె ప్యాకెట్ ధర రూ.127 నుంచి రూ.145 వరకు ఉన్నాయి. గత ఏడాది ఇదే సమయంలో లీటర్ నూనె రూ.85 నుంచి రూ.100 మధ్యలో ఉండటం గమనార్హం. ఇక తొలిసారి లాక్డౌన్ విధించిన మార్చి నెలలో రూ.వంద నుంచి రూ.110 మధ్య ఉన్న నూనెల ధరలు ఇప్పుడు మండిపోతున్నాయి. జూలైలో 5 కిలోల సన్ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ టిన్ ఖరీదు రూ.495 ఉండగా ఇప్పుడది రూ.580 దాటింది. ప్రస్తుతం సన్ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ లీటర్ ప్యాకెట్ రూ.127 ఉండగా గత నెలలో ఇది రూ.105గా ఉంది.