నగదు బదిలీ పథకం ద్వారా రైతులపై ఒక్క రూపాయి కూడా భారం పడబోదని చెప్పారు సీఎం జగన్. ఈ విషయంపై విస్తృత ప్రచారంతో రైతుల్లో అవగాహన కల్పించాలని ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. రైతులకు వ్యవసాయానికి పగలే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలని స్పష్టం చేశారు. ట్రాన్స్ ఫార్మర్లు, మీటర్ల సేకరణ, ఏర్పాటులో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ఇంధన శాఖ, వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకంపై క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన జగన్.. అధికారులకు క్లాస్ తీసుకున్నారు.