కేవలం 15 నెలల పదవీకాలం ఉన్న నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి కవితను ఎంపిక చేయడం వెనుక సీఎం కేసీఆర్ వ్యూహం ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆమెను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే పూర్థిస్థాయి మంత్రివర్గం కొలువుతీరి ఉన్న నేపథ్యంలో ఆమెకు మంత్రి పదవిని ఎలా సర్దుబాటు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.