ప్రస్తుతం రెడీ అవుతున్న వ్యాక్సిన్ ను ముక్కు ద్వారా వేసే అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా వైరస్ ముక్కు నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశించి మన ఊపిరితిత్తులతో పాటు రోగనిరోధక వ్యవస్థపై దాడి చేస్తోంది...అంతేకాదు శరీరంలోని ఇతర ముఖ్యమైన అవయవాల పనితీరుపై కూడా ప్రభావం చూపుతుందని ఇప్పటికే అందరికీ తెలుసు. అందులోనూ ముఖ్యంగా శ్వాసకోశ వ్యవస్థపై దాడి చేస్తుంది.