తమపై విమర్శలు చేస్తే వారిపై ఎదురుదాడికి దిగి వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ప్రతిపక్ష టీడీపీకి బాగా అలవాటైనట్లు కనిపిస్తోంది. ఇటీవల అమరావతిపై విమర్శలు చేసిన మంత్రి ధర్మాన కృష్ణదాస్ టార్గెట్గా టీడీపీ నేతలు ఎలాంటి విమర్శలు చేశారో అందరికీ తెలిసిందే. ఇక మంత్రి జయరాంపై అయితే ఊహించని విధంగా అవినీతి ఆరోపణలు గుప్పించారు. ముఖ్యంగా టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు, జయరాం లక్ష్యంగా సంచలన ఆరోపణలు చేశారు.