ఏపీ రాజకీయాలని రాజధాని అంశం కుదిపేస్తున్న విషయం తెలిసిందే. సీఎం జగన్ ఎప్పుడైతే అసెంబ్లీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారో, అప్పటి నుంచి రాజధాని రగడ నడుస్తుంది. అధికార వైసీపీ ఏమో మూడు రాజధానులు కావాలంటే, ప్రతిపక్ష టీడీపీ మాత్రం మూడు వద్దు, అమరావతిలోనే మొత్తం రాజధాని ఉంచాలని కోరుతున్నారు. పోరాటాలు చేస్తున్నారు. అలాగే అమరావతి రైతులు 300 రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నారు. ఈ ఉద్యమానికి టీడీపీ నేతలు మద్ధతు తెలుపుతూ, అమరావతి రెఫరెండంగా ఎన్నికలకు వెళ్లాలని వైసీపీకి సవాల్ విసురుతున్నారు.