దేశవ్యాప్తంగా అధిక వర్షాలతో ఉల్లిపంట దెబ్బతినడంతో ఊహించని విధంగా రేట్లు పెరుగుతాయని అనుకున్నారంతా. అయితే రాష్ట్రంలో ఉన్న స్టాక్ తో ఆ ఇబ్బంది లేకుండా పోయింది. ప్రస్తుతం ఉల్లి కేజీ రూ.50 కి దొరుకుతోంది. అయితే రానురాను రాష్ట్రంలోని ఉల్లిపాయల్ని వ్యాపారులు బ్లాక్ మార్కెట్ కి తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఎక్కువ రోజులు నిల్వచేయడానికి కుదరని వ్యవహారం అయినా కూడా కృత్రిమంగా రేట్లు పెంచడానికి ఉల్లిపాయల్ని మార్కెట్ నుంచి మాయం చేస్తున్నారు వ్యాపారులు.