మీరు హైదరాబాద్ లో ఉంటున్నారా.. అయితే ఇళ్లు దాటి బైటకు రావొద్దు. పాల ప్యాకెట్ కి అయినా, మరింకేదైనా అత్యవసర విషయంపై ఆయినా.. బైటకు వచ్చారో ప్రమాదంలో పడ్డట్టే.. హైదరాబాద్ పరిధిలో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఎక్కడికక్కడ మ్యాన్ హోళ్లు పొంగి పొర్లుతున్నాయి. రోడ్డుపై అడుగు పెడితే ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. ఎక్కడికక్కడ విద్యుత్ వైర్లు తెగి వేళాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు బైటకు వస్తే ఇంటికి క్షేమంగా వెళ్తారో లేదో తెలియదు. అందుకే హైదరాబాద్ వాసులంతా మరో 24గంటలపాటు ఇళ్లకే పరిమితం కావాలని హెచ్చరిస్తున్నారు అధికారులు.