యోగాసనాలు వేస్తూ ఆశ్రమంలో ఉన్న వారికి నేర్పించే క్రమంలో ఎప్పటిలాగే ఆయన స్టేజీ పై కాకుండా కాస్త విరుద్ధంగా చేయడానికి భారీ ఏనుగును ఎక్కారు. దాని పై కూర్చుని బాబా పద్మాసనం వేశారు. ఇంకేం ఉంది రామ్ దేవ్ బాబా ప్రాణాయామం చేస్తుండగా ఏనుగు ఎందుకో అటూ ఇటూ కదిలింది. కానీ బాబా పట్టించుకో లేదు. ఆ తర్వాత ఏనుగు మరోసారి అలాగే అటూ ఇటు ఊపడంతో ఆయన అదుపు తప్పి కింద పడిపోయారు.