వాన భారీ వర్షంగా మారినప్పుడు.. రోడ్లు మొత్తం వర్షపు నీటితో పోటెత్తిన వేళ.. అప్పటివరకు ఉన్న రోడ్లు కంటికి కనిపించవు. ఇక.. వర్షం ధాటికి గుంతలు పెరిగిపోవటం.. మ్యాన్ హోల్స్ మొరాయించటం.. నాలాలు కోరలు జాచి ప్రాణాలు తీసే పరిస్థితి. సరిగ్గా ఇలాంటి పరిస్థితే హైదరాబాద్ మహానగరంలో నెలకొంది.