ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్వి రమణపై ఫిర్యాదు చేస్తూ, సుప్రీం సిజేఐ జస్టిస్ బాబ్డేకు లేఖ రాయడం జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. రమణ, చంద్రబాబుతో కుమ్మక్కయ్యారని, ఆయన హైకోర్టు న్యాయమూర్తిని ప్రభావితం చేస్తున్నారని.. హైకోర్టులో ఏ కేసు ఏ బెంచ్ మీదకు వెళ్లాలో కూడా ఆయనే నిర్ణయిస్తున్నారన్నది జగన్ లేఖలో ఆరోపించారు.