టీడీపీకి కాస్త అనుకూలమైన జిల్లాలో కృష్ణా కూడా ఒకటి. ఎప్పుడు ఎన్నికలు జరిగిన ఇక్కడ ఆ పార్టీకి మంచి ఫలితాలు వచ్చేవి. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం జగన్ దెబ్బకు చాపచుట్టేసింది. జిల్లాలోని 16 అసెంబ్లీ స్థానాల్లో రెండు మాత్రమే గెలిచింది. అటు రెండు పార్లమెంట్ స్థానాల్లో విజయవాడ ఎంపీ సీటుని గెలిచింది. అయితే కేశినేని నాని సొంత ఇమేజ్ కాస్త పార్టీకి ప్లస్ అయింది. అలాగే గెలిచిన ఎమ్మెల్యేల్లో వల్లభనేని వంశీ ఎప్పుడో టీడీపీని వీడారు. దీంతో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాత్రం మిగిలారు.