మొన్నటివరకు విశాఖపట్నం టీడీపీలో కీలకంగా వ్యవహరించిన వాసుపల్లి గణేశ్...హఠాత్తుగా టీడీపీని వీడి జగన్కు జై కొట్టిన విషయం తెలిసిందే. విశాఖ సౌత్ ఎమ్మెల్యేగా ఉన్న వాసుపల్లి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా, అధికారికంగా వైసీపీలో చేరకుండా, జగన్ ప్రభుత్వానికి మద్ధతు తెలిపారు. అలాగే తన కుమారులని మాత్రం అధికారికంగా వైసీపీలో చేర్చారు. అయితే వాసుపల్లి ఇప్పుడు అనధికారికంగా వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అందుకే ప్రస్తుత మీడియా సమావేశాల్లో చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నారు.