ఐక్యరాజ్యసమితికి చెందిన వాతావరణ విభాగం ‘స్టేట్ ఆఫ్ క్లైమేట్ సర్వీసెస్ రిపోర్ట్ 2020’ రూపొందించిన నివేదిక ఇటీవల విడుదలైంది. ఈ నివేదికలోని అంశాలు రాబోయే పదేళ్లలో ముంచుకొస్తున్న ముప్పుని సూచిస్తున్నాయి. 2030నాటికి మరణాలు, విపత్తుల సంఖ్య ఇప్పటికంటే రెట్టింపు అయ్యే అవకాశముందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది.