గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,500 పైగా కాలనీలు జలదిగ్బంధమయ్యాయి. 20,540 ఇళ్లు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. సుమారు 30 పాతభవనాలు, గోడలు కూలిపోయాయి. వందేళ్ల తర్వాత కురిసిన రికార్డు స్థాయి వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది.