కొద్దిరోజుల క్రితం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కరోనాబారిన పడ్డారు. దీంతో ఆయన్ను విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స తీసుకుంటుండగానే.. ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో మెరుగైన వైద్యంకోసం ఆయన్ను హైదరాబాద్ తరలించాలని చూశారు కుటుంబ సభ్యులు. అయితే రోడ్డు మార్గం లేకపోవడం, ఆలస్యమైతే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పడంతో.. ముఖ్యమంత్రి జగన్ చొరవతో ప్రత్యేక విమానంలో ఆయన్ను హైదరాబాద్ చేర్చారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు.