ఇప్పుడు చినుకు తో కష్టాలు వచ్చాయి బస్తీవాసులకి. వారి జీవనాలు ఛిద్రమైపోతున్నాయి. ఈ భారీ వర్షాల ఫలితంగా 150 కి పైగా ప్రాంతాలు నదులను తలపిస్తూ ఆస్తి ప్రాణ నష్టాలను మిగిల్చాయి. వందేళ్లల్లో రెండో సారి కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరం తట్టుకో లేకపోతోంది. వాన అంటే చాలు ఇక్కడ ప్రజలు చిగురుటాకులా వణుకుతున్నారు.