సాధారణంగా ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు అధికార పార్టీలోకి జంప్ కొట్టడం సహజం. అలాగే ప్రతిపక్ష పార్టీ అధినేతలు తమ నేతలని ఏదొరకంగా సర్దిచెప్పుకుని పార్టీలు మారకుండా చూసుకుంటారు. కానీ ఏపీలో మాత్రం ప్రతిపక్ష నేత చంద్రబాబు తమ పార్టీ నాయకులని గాలికొదిలేసినట్లు తెలుస్తోంది. నాయకులు ఎవరు పార్టీ మారుతున్న పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు పార్టీ మారిన విషయం తెలిసిందే. అలాగే నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్ధతు తెలిపారు.